అనారోగ్యంలో ఆంధ్ర ముందుందని అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్యుడు డా. మంతెన సత్యనారాయణరాజు. పాలిష్డ్ రైస్, నూనెలు, ఉప్పుల వాడకం వల్ల జనం అనారోగ్యం పాలవుతున్నారని తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పుకొచ్చారు.
రాజమహేంద్రవరం: షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆంద్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని చెబుతున్నారు ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణరాజు. ఆహారపు అలవాట్లులో మార్పులు తీసుకురావడంతో ఆరోగ్యంగా వుండవచ్చునని ఆయన సూచిస్తున్నారు. కడియపులంక గంగుమళ్ల నర్సరీని డాక్టర్ రాజు సందర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై ఎవరికీ ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని రాజు అన్నారు. గతంలో అరవై ఏళ్ల తర్వాత వచ్చే షుగర్ వ్యాధి ఇప్పుడు ఇరవై ఏళ్లకే వెంటాడుతున్నదని చెప్పారు. పాలిష్ చేసిన బియ్యం, అధిక మోతాదులో వాడే ఉప్పు, నూనెలు, మాంసాహరాలు, షుగర్, బీపీ, గుండె, థైరాయిడ్ వంటి వ్యాదులకు కారణమవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ముడి బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం మంచిదేనన్నారు.