ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బంధువు మజార్ అలీ ఖాన్ సోమవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంట్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
ఆస్తులు, కుటుంబ తగాదాల కారణంగా మజార్ అలీ ఖాన్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నగరంలోని డెక్కన్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ డాక్టర్ అయిన ఆయన వయస్సు సుమారు 60 ఏళ్ళు.
. ఆయన ఒవైసీకి వియ్యంకుడని కూడా తెలిసింది. ఆయన ఆత్మహత్య సమాచారం తెలియగానే అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ హుటాహుటిన అపోలో ఆసుపత్రికి వెళ్లారు.
టాప్ ఆర్థోపెడిక్ డాక్టర్లలో ఒకరైన మజార్ అలీ ఖాన్ సూసైడ్ చేసుకోవడం వైద్య రంగాన్ని దిగ్భ్రాంతి పరచింది. తన 29 ఏళ్ళ మెడికల్ ప్రొఫెషన్ లో ఆయన అనేకమంది రోగులకు చికిత్సనందించారు. ఆయన ఆత్మహత్య సమాచారం తెలియగానే వెస్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
.