డాక్టర్ నూతన్‌నాయుడు, విద్యావేత్త
ఒకరి మరణం
కొందరికి వివాదం
ఇంకొరికి వ్యాపారం
మరికొందరికి ప్రచారం
చాలామందికి రాజకీయం.
ఇది వరకు చావు వార్త వింటే
అయ్యో అనుకునేవాళ్లం.
వాళ్ల తప్పుల్ని,
పాపాల్ని కూడా మర్చిపోయి..
కన్నీరు పెట్టేవాళ్లం.
ఇప్పుడు చావునీ వదిలిపెట్డం లేదు.
శవాన్ని లేపి మరీ – మన రాక్షసత్వం చూపించుకుంటున్నాం.
పోయింది ప్రాణమా.. మనలోని మానవత్వమా?
చనిపోయినవాళ్లని గౌరవించకపోయినా ఫర్వాలేదు.
కనీసం చావుని గౌరవించండి!
రేపు మనం పోతే
మోయడానికి కాదు.. మోసేయ్యడానికి నలుగురు తయారవుతారేమో చూసుకోండి!