డాక్టర్ తాటికాయల జయరామ్
మీ కుటుంబం కోసం దయచేసి మీ ఇంటిలోనే ఉండండి. ఒక వైద్యుడిగా కరోనా కోవిడ్ 19 మీద పోరాటంలో ఉన్నాము. డాక్టర్, నర్స్, పారామెడికల్ సిబ్బంది చివరికి లిఫ్ట్‌బోరు కూడా కోవిడ్ 19కి గురికావచ్చు, మేము ఎందుకు పోరాడుతున్నామో అర్ధం చేసుకోవాలి. వైద్యపరంగా ఎంతో ముందున్న దేశం కూడా నేడు రోదిస్తున్న తరుణంలో మీరు ఎందుకు బయటికి వస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మీ సంతోషం మరియు మన దేశం కోసం ఒక వైద్యుడిని గౌరవించాలి, ఒక వైద్యుడిగా హృదయాంతరాళం నుంచి వెలువడుతున్న భావాలు తప్ప కొన్ని మాటలు కాదు, జాగ్రత్తగా నేను చెప్పేది వినండి
మనం ఇప్పుడు చాలా కీలకమైన దశలోకి ప్రవేశిస్తున్నాము.మనకు పెద్ద ముప్పు పొంచి వుంది. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్19 వ్యతిరేక పోరాటంలో అందరమూ సమాన ప్రాధాన్యత కలిగినవారమే.
ఈ పరిస్ధితిలో అరవై రోజులు గృహబందీ ఎంతో అవసరం !
1. వైరస్‌కు మీరు దూరంగా ఉండండి( ఇప్పటికే మనకు తెలియాల్సినవన్నీ తెలిశాయి)
2.వైరస్ గురించి అదనపు సమాచారం కోసం ఇంటర్నెట్ వైపు చూడవద్దు. అది మీ మానసిక స్ధితిని బలహీనపరుస్తుంది, (సోమటైజేషన్) మానసిక వత్తిడికి కారణం కావచ్చు.
3.తీవ్రమైన వర్తమానాలు, వీడియోలు, సమాచారం వంటి వాటిని ఇతరులకు పంపవద్దు. కొంత మంది మీ మాదిరి పటిష్టమైన మానసిక స్ధితిని కలిగి ఉండకపోవచ్చు. వారికి సాయం చేయకపోగా వారిని కుంగిపోవటం వంటి జబ్బులకు గురి చేస్తుంది.
4. వీలైతే వీనుల విందు స్ధాయిలో సంగీతం వినండి, పిల్లలతో ఆడుకోండి, వారికి మంచి చెడ్డలను, భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పండి.
5. మీ చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ క్రమశిక్షణ పాటించండి, ఇంట్లో వారందరికీ తెలిసే విధంగా సూచికలు లేదా హెచ్చరికలను ఏర్పాటు చేయండి.
6. మీ సానుకూల మానసిక స్ధితి మీ నిరోధక వ్యవస్ధను రక్షిస్తుంది. వ్యతిరేక భావనలు దానిని బలహీనపరుస్తాయి, వైరస్‌కు వ్యతిరేకంగా బలహీనపడతాయి.
7.అత్యంత ముఖ్య మైనదేమంటే ఈ విశ్వం దేవుడి చేతిలో ఉందని, దీన్నుంచి బయటపడతామని గట్టిగా విశ్వసించండి. దేవుడు ఉన్నది ప్రేమించటానికి తప్ప శిక్షించటానికి కాదు. ఉష్ణోగ్రతలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అందరూ గ్రహించాలి.
దేశం ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ వైరస్ సోకిన వారు
అమెరికా 9 1,23,870
ఇటలీ 10 92,472
చైనా 13 81,439
స్పెయిన్ 16 73,235
జర్మనీ 7 58,247
ఇరాన్ 12 35,408
భారత్ 28 987
ఉష్ణోగ్రతలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కనుక దయచేసి కొద్ది రోజులు మీ ఎయిర్‌కండిషన్లను కట్టివేయండి. వాటికి అలవాటు పడిన వారు కొద్ది రోజులు దూరంగా ఉండటం కష్టమే కావచ్చు కానీ లేకుండా అలవాటు పడాలి.
కరోనా చికిత్స
అనుభవాల ప్రాతిపదికన చూసినపుడు అన్ని దేశాలలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పులకు అందరూ బాధ్యత వహించాలి. కరోనా వైరస్ నివారణకు గాను తగిన ఔషధాల కోసం పరిశోధనలు అవసరం. ప్రతిదాన్నీ లాభాల దృష్టితో చూస్తే మానవాళికి ఎంత ప్రమాదకరమో అభివృద్ది చెందిన దేశాలు ముఖ్యంగా అమెరికా తప్పనిసరిగా గుర్తించాలి. ఈ కష్ట కాలంలో మహత్తరమైన ప్రపంచ సోషలిజాన్ని మరోసారి అభినందించాల్సి ఉంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని ఊహాన్ ప్రాంతంలో అది ప్రారంభమైంది. ఆ ప్రాంతాన్ని మూసివేసి చైనా ప్రభుత్వం వెంటనే యుద్దం ప్రకటించింది. మెరుపువేగంతో కొత్త ఆసుపత్రులను నిర్మించింది. బయటి నుంచి వైద్య పరికరాలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను రప్పించింది. చికిత్సలో వెంటిలేటర్లు కీలక పాత్ర పోషించాయి. కనుక కరోనాతో ముడిపెట్టి ఆదేశాలు, నిర్ణయాలతో నిమిత్తం లేకుండా వాటి కొరత లేకుండా చూడాలి.
వాక్సిన్ తయారీకి ప్రయత్నాలు ప్రారంభం కావాలి. కమ్యూనిస్టు పార్టీకి అంకితమైన జనం ఉన్న కారణంగా అది సాధ్యమే. ఇంకా పూర్తిగా అయిపోలేదు. ఆధునిక ఆరోగ్య వ్యవస్ధను కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం నిర్మించింది. ఈ అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొనేందుకు అది తోడ్పడుతుంది. చైనా నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రశంసించింది. అది సోషలిస్టు వ్యవస్ద లక్షణం. ఇప్పుడు చైనా ఐరోపా యూనియన్‌కు అవసరమైన వైద్య పరికరాలను ఎగుమతి చేస్తోంది. క్యూబా కూడా సోషలిస్టు దేశమే. అక్కడ ప్రతి వెయ్యి మందికి 7.8 మంది వైద్యులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నతమైన వాటిలో ఒకటిగా క్యూబా ఆరోగ్య వ్యవస్ధ గుర్తింపు పొందింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు క్యూబా ఇప్పుడు వెనెజులా, ఇటలీ, ఆఫ్రికా దేశాలకు వైద్యులను పంపింది.
మరోవైపున పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అమెరికాలో ఆరోగ్య వ్యవస్ద ప్రయివేటు రంగంలో ఉంది, మహమ్మారిని ఎదుర్కొనే సామర్ధ్యం దానికి లేదు.తగినన్ని ఆసుపత్రులు లేవు. వైద్యులు,నర్సులు, సిబ్బంది, వెంటిలేటర్ల కొరత వుంది. పెట్టుబడిదారీ దేశాలలో అమలు జరుపుతున్న నయావుదారవాద విధానాలు ప్రజారోగ్యం నుంచి ప్రభుత్వాలను దూరం చేయటమే దీనికి కారణం. వారు ఆరోగ్య వ్యవస్ధను నిర్లక్ష్యం చేశారు. బడ్జెట్ కేటాయింపులను తగ్గించారు. ఇవన్నీ ఇప్పుడు ఒక సవాలును ముందుకు తెచ్చాయి, వ్యవస్ధలోని లోపాలేమిటో స్పష్టమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అమెరికా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాలు ఆలస్యంగా స్పందించాయి.వారు ఈ సంక్షోభ సమయంలో ప్రజల ఆరోగ్యం కంటే ఆర్ధిక వ్య వస్ధల లోటుగురించి కేంద్రీకరించారు. కార్పొరేట్లను రక్షించేందుకు స్టాక్ మార్కెట్ పతనాలను నివారించేందుకు ఉద్దీపన పధకాలను పకటించారు. ఒక వైపు పౌరుల ప్రాణాలు పోతున్నా ఇరాన్, వెనెజులా వంటి దేశాలపై ఆంక్షలను అమెరికా ఎత్తివేయలేదు. సామ్రాజ్యవాదం అంటే ఇదే. వారికి జనం కంటే లాభాలే ముఖ్యం. కరోనా మహమ్మారి సవాలు విసిరిన సమయంలో సామ్రాజ్యవాద దేశాలు అనుసరిస్తున్న విధానాలు వాటి నిజ స్వరూపం ఏమిటో ప్రపంచానికి వెల్లడించాయి. వాతావరణ మార్పులతో పాటు ఇది మరొక పాఠం.
కరోనాను అదుపు చేసేందుకు చైనా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసింది. ఫ్యాక్టరీలను, బొగ్గుఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసివేసింది. ఫలితంగా నాలుగో వంతు కర్బన ఉద్గారాలు తగ్గినట్లు వారు చెబుతున్నారు. ప్రపంచ వ్యాపితంగా విమాన ప్రయాణాలు నిలిచిపోయిన కారణంగా ఐదుశాతం కర్బన ఉద్గారాల విడుదల తగ్గిపోయింది. ద్విచక్రవాహనాలు, కార్లు విడుదల చేసే నైట్రోజన్ డైఆక్సైడ్ తగ్గింది. వాతావరణ మార్పు బూటకం ఒక భ్రమ అని డోనాల్డ్ ట్రంప్ కొట్టివేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. రెండు నెలల తరువాత వాతావరణం మెరుగుదలకు బగ్గు, పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గటమే కారణం.దీన్నొక అవకాశంగా తీసుకొని పర్యావరణాన్ని మరింత మెరుగుపరచేందుకు రానున్న రోజుల్లో సోలార్, గ్యాస్ విద్యుత్ ఉత్పిత్తి అవకాశాలను పరిశీలించాలి.భారతీయులందరికీ కృతజ్ఞతలు
రచయిత డాక్టర్ టి జయరామ్ సామాజిక,రాజకీయ విశ్లేషకులు. ఎంబిబిఎస్, ఎండి(మామ్స్ పిడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ వాషింగ్టన్ డిసి, అమెరికా మాజీ అంతర్జాతీయ సమన్వయకర్త, తెలంగాణా డాక్టర్స్ ఫెడరేషన్ సలహాదారు.