కశ్మీర్‌లో చలి పంజా విసురుతోంది. ఇప్పటికే లోయలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుల్మర్గ్‌లో ఈ సీజన్‌లోనే అత్యంత అల్ప ఉష్ణోగ్రత మైనస్ 12 డిగ్రీలు నమోదైంది. తాజాగా మంగళవారం లడఖ్‌లోని డ్రాస్ సెక్టార్‌లో మైనస్ 29 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.
లోయలో కోల్డ్ వేవ్ కొనసాగుతున్నట్టు ఐఎండీ పేర్కొంది. శ్రీనగర్‌లో నిన్న ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల ఉండగా రాత్రికి 2.7కు పడిపోయినట్టు వెల్లడించింది. దక్షిణ కశ్మీర్‌లో కొకెర్ నాగ్‌లో మైనస్ 5.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కుప్వారాలో మైనస్ 4.3డిగ్రీల సెల్సియస్ నమోదైట్టు పేర్కొంది.
అనంతనాగ్ జిల్లా పహల్ గామ్‌లో మైనస్ ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్, గుల్మర్గ్ లో మైనస్ 11.5 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయినట్టు చెప్పారు. కార్గిల్‌లో మైనస్ 20.9, లేహ్‌లో మైనస్ 15.6 డిగ్రీలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 19 నుంచి 21 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీనగర్‌లో నల్లాల్లో నీరు గట్టకట్టుకు పోయినట్టు అధికారులు చెప్పారు. రాబోయే 24 గంటల్లో జమ్మూలో ఆకాశం క్లియర్‌గా ఉంటుందని పేర్కొన్నారు.