ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లను వేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లతో ఆమె మాట్లాడినట్టు సమాచారం.
తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని ఆయా నాయకులను ద్రౌపది ముర్ము కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నామినేషన్‌కు ముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ, అంబేడ్కర్, బిర్సా ముండా విగ్రహాలకు ఆమె పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
మొదటి సెట్ లో ఆమె అభ్యర్థిత్వాన్ని మొదట ప్రధాని మోడీ, ఆయన తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రెండవ సెట్ లో ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు.