ఎంతవారలైనా కాంతదాసులే అని ఊరికే అన్నారా..? ఉన్నత పదవుల్లో ఉండి.. హస్కీ వాయిస్ వినిపడగానే వలలో పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒడిశా చాందీపూర్ డీఆర్డీవో రహస్యాల లీకేజ్ కేసులో అదే నిజమౌతోంది. ఓ మాయ లేడీ.. హస్కీ వాయిస్ కు ఫిదా అయిన ఐదుగురు డీఆర్డీవో అధికారులు దేశ రహస్యాలు చెప్పి ఆమెకు దాసోహం అయ్యారు. ఎన్ఐఏ జరుపుతున్న విచారణలో ఒక్కొక్క నిజాలు బయటపడ్డాయి.
ఐదుగురు అధికారులకు ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ముగ్గులోకి దింపింది కిలేడీ. ఒకరితో దుబాయ్ అంటే ఇంకొకరితో రాజస్థాన్ అని తెలిపింది. అలా ఐదుగురికి ఐదు ప్రాంతాలు చెప్పింది. వీడియో కాల్స్, వాట్సాప్ చాటింగ్ ఇలా ఒకటేంటి.. తనకు రావాల్సిన సమాచారం అందేవరకు అంతా కూపీ లాగింది. యూకేకు చెందిన ఫోన్ నెంబరు ద్వారా ఆ మహిళ మాట్లాడినట్లు గుర్తించింది ఎన్ఐఏ. దాదాపు 18 నెలలుగా ఈ హనీట్రాప్ జరిగుతోందని తెలుసుకుంది.