భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకు బలోపేతం అవుతోంది. గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు వరుసగా విజయవంతం అవుతున్నాయి. మార్చి 27న మీడియం రేంజ్ మిస్సైల్ సుదూరంలో ఉన్న హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుంది. అయితే, తాజాగా మరో మిస్సైల్‌ను గగనతలంలోకి విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఉపరితలం నుండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అధికారులు క్షిపణి ప్రయోగాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యశ్రేణి మిస్సైల్ వ్యవస్థను పరీక్షించారు. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రయోగాలు విజయవంతంగా సాగినట్లు అధికారులు చెప్పారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ.. ఇండియన్ ఆర్మీకి చెందినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఎంఆర్ఎస్ఏఎం క్షిపణి వ్యవస్థ ప్రయోగం ఇండియా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్ నుంచి డీఆర్డీఓ, ఇజ్రాయెల్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి.
విమానాలు, హెలికాప్టర్లు, యాంటషిప్ మిసైళ్లను ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను సైతం ఇది అడ్డుకోగలదు. 60 కేజీల వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణులు ఇందులో ఉంటాయి. 70 కి.మీ. దూరంలోని.. ఇప్పటికే ఈ క్షిపణి వ్యవస్థ వాయుసేన అమ్ముల పొదిలో చేరింది. ప్రస్తుతం సైన్యం కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
India today carried out two successful test firings of the Medium Range Surface to Air Missile system air defence systems off the coast of Odisha in Balasore: DRDO officials
(file photo) pic.twitter.com/FEOADHKO5J
— ANI (@ANI) March 30, 2022
Advertisements