పాట్నా: సెక్రటేరియెట్‌లో డ్రెస్‌కోడ్ పెట్టారు. కంగారు పడకండి. మన దగ్గర కాదు. బీహార్ పాట్నా సచివాలయంలో. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేటప్పుడు జీన్స్, టీ షర్టులు వేసుకుని రాకూడదని స్ట్రిక్ట్‌గా ఆర్డరేశారు అక్కడి అధికారులు. ఫార్మల్ డ్రెస్సులే వేసుకుని ఆఫీసుకు రావాలని, ఎలా పడితే అలా తయారై వస్తే కుదరదని ఆఫీసర్లు జీవో ఇచ్చారు. ఆఫీస్ కల్చర్‌కు భిన్నంగా ఎక్కువమంది ఉద్యోగులు జీన్ ప్యాంటులు, రంగురంగుల టీ షర్టులు ధరిస్తూ కార్యాలయాలకు రావడం నచ్చని పెద్దలు ఈ డెసిషన్ తీసుకున్నారు. దీనిపై అక్కడ ఉద్యోగుల్లో రచ్చ మొదలయ్యింది. డ్రెస్‌కోడ్ ఎలా పెడతారని ఎంప్లాయీస్ అసోసియేషన్లు చర్చలు పెట్టాయి.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » సెక్రటేరియెట్‌లో నో జీన్స్ ! ఎంప్లాయీస్ గగ్గోలు