ఈ మధ్య ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారిస్తున్న సంగతి అర్ధమవుతుంది. డైట్ విషయంలో సీరియస్ గా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు ఏ మార్గాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇక వేడి నీళ్ళు తాగితే రోగాలు తగ్గే అవకాశం ఉంది, బరువు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అయితే చల్లటి నీళ్ళు తాగితే బరువు తగ్గుతారా లేదా అనేది చాలా మందికి క్లారిటీ లేదు.
Also Read:రెండు వేర్వేరు ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు
చల్లటి నీళ్ళ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అరుగుదల విషయంలో చల్లటి నీళ్ళు ఇబ్బంది పెడతాయి అనే భావన చాలా మందిలో ఉంది. చల్లటి నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మందగించే అవకాశం ఉందనే భావన ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని కూల్ వాటర్ తాగితే అరుగుదల ప్రక్రియ వేగం పెరుగుతుందని చెప్తున్నారు.
అంతర్గత ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి మన శరీరం కష్టపడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ షుగర్ అలాగే కొవ్వులు కరిగిపోతు ఉంటాయి. అదే బరువు తగ్గడానికి కారణం. చల్లని నీరు తాగేవారు జాగింగ్ చేసినా, సైకిల్ తొక్కినా, బరువులు ఎత్తినా అలసిపోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయగలుగుతారు అని వైద్యులు చెప్తున్నారు. రన్నింగ్ కోసం బయటకు వెళ్తే బాడీ కూల్ గా ఉండటానికి ఐస్ క్యూబ్స్ బాటిల్ చాలా మంచి చేస్తుంది.
వాపు, నొప్పి విషయంలో కూడా మీకు ఉపయోగం ఉంటుంది. కోల్డ్‌వాటర్ మన చర్మం క్రింద సెన్సార్‌లను ప్రేరేపిస్తుంది, మన పల్స్ రేటును పెంచుతుంది. ఐస్ కోల్డ్ వాటర్ శరీరం నుండి టాక్సిన్‌లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read:ఇండియాలో పది అంకెల మొబైల్ నెంబర్ ఎందుకు వాడతాం…?