చచ్చిపోయి బతికిపోయాడు ! - Tolivelugu

చచ్చిపోయి బతికిపోయాడు !

మహాముదురు ఒకడు ఒకరికి తెలియకుండా ఒకర్ని పెళ్లి చేసుకుని ఏడు చోట్ల కాపురం పెట్టాడు. అంటే ఏడుగురు పెళ్లాలన్న మాట. రాజు గారి ఏడు చేపల్లా ! ఈ ఏడుగురితో ఎలా మేనేజ్ చేసేవాడో కానీ, సడెన్‌గా అతను పోయాడు. అది కూడా ఆత్మహత్య చేసుకుని మరీ పోయాడు. అప్పుడు తెలిసింది ప్రపంచానికి అయ్యగారి ఏడు పెళ్లిళ్ల స్టోరీ..


, చచ్చిపోయి బతికిపోయాడు !

ఢిల్లీ: ఒక వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు మహిళలు ఆందోళనకు దిగారు. అందరూ కూడా అతగాడే నా మొగుడు అంటూ గొడవ పడుతున్నారు. ఇది కాస్తా ఘర్షణగా మారడంతో పోలీసులు సీన్‌లోకి వచ్చారు. ఏంటి సంగతి అని ఆరా తీశారు. తీరా వారు చెప్పిందంతా విని తలలు పట్టుకున్నారు. అందరూ కూడా అతడే మొగుడని బల్లగుద్ది చెబుతున్నారు. నేనే అతని భార్య అని ఒకరంటే, కాదు.. నేనే అతని భార్య అని మరొకామె అంటోంది. ఛస్.. అసలు పెళ్లాన్ని నేనే అంటూ ఇంకో ఆమె ముందుకొస్తోంది. అలా ఏడుగురూ కూడా ఎవరి ఆర్గ్యుమెంట్లు వారు చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులకు అర్ధమైంది ఏంటంటే.. చనిపోయిన వ్యక్తికి వీరంతా భార్యలే. అదే మేటర్ అక్కడున్న వారికి చెప్పారు. దాంతో ఊరు ఊరంతా షాకయ్యింది.

హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీలో ఇది జరిగింది. ఈ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలిస్తే చనిపోయాడని డాక్టర్లు చెప్పేశారు. తర్వాతే అసలు స్టోరీ షురూ అయ్యింది. ఇంటికి శవం రావడం చూసి అతని భార్య ఏడుపు మొదలెట్టింది. ఇంతలో అక్కడికి మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. అందరూ నా మొగుడు పోయాడంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. డెడ్ బాడీని అప్పగించాలంటూ ఎవరికి వారు గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న ఏడుగురు పెళ్లాల్ని చూసి జనం సినిమా చూసినట్టు చూశారు. ఇంతలో పోలీసులు వచ్చి అసలే సంగతి కనుక్కున్నాక గొడవ సర్దుమణిగింది. ఎలాగో అలా అతని అంత్యక్రియలయితే నిర్వహించారు. కానీ, ఈ గొడవపై అప్పుడే ఒక డెసిషన్‌కు రాలేమని, కొన్నాళ్లు ఆగితే వారి మధ్య ఒక అవగాహన వస్తుందని పోలీసులు పెదరాయుడి తీర్పులా చెప్పేసి వెళ్లిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీళ్లంతా ఒకే వ్యక్తికి భార్యలమని అప్పటి వరకు ఏ ఒక్కరికీ తెలియకపోవడం. చనిపోయాక తెలిసింది కాబట్టి ఆ మనిషి బతికిపోయాడు. లేకపోతే అప్పుడు వాళ్ల చేతిలో తన్నులు తిని చచ్చేవాడు..

Share on facebook
Share on twitter
Share on whatsapp