ఇక్కడ కూడా కులమేనా... జగన్? - Tolivelugu

ఇక్కడ కూడా కులమేనా… జగన్?

dronam raju ravi kumar letter to cm ys jagan over cs lv subramanyam transfer, ఇక్కడ కూడా కులమేనా… జగన్?

                                                                                                  ద్రోణంరాజు రవికుమార్, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు

                              

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాన్యశ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి…

తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణులు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు చూసి మీ హయాంలో బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తో, బ్రాహ్మణులకు రాజకీయ పునరావాసం కల్పించారు అన్న కృతజ్ఞతతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లేసి మా బ్రాహ్మణ సామాజికవర్గం మీకు అండగా నిలబడడం జరిగింది. మీరు అధికారంలోకి రాగానే 439 నెంబర్ జీవో ద్వారా అర్చక వారసత్వ హక్కు కల్పించి బ్రాహ్మణుల కు అండగా నిలిచారు. అదేవిధంగా అర్చకుల జీతాలు పెంచడం, నిత్య దీప ధూప నైవేద్య స్కీం లో ఆలయాల సంఖ్య పెంచడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గత నాలుగు రోజులుగా ప్రభుత్వం లో జరుగుతున్న పరిణామాలు మా సామాజికవర్గంలో అభద్రతా భావాన్ని కల్పిస్తున్నాయి.
.. ఇద్దరు అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడడం తో మీరు పెద్దన్న పాత్ర పోషించి వారిరువురు మధ్య సమన్వయ పరచి ఉంటే సమస్యకు పరిష్కారం లభించేది.కానీ మా సామాజిక వర్గం కు చెందిన అధికారికి అన్యాయం జరిగింది అని మా సామాజిక వర్గం మధనపడుతొంది. తప్పు చేసి ఉంటే ఇద్దరు అధికారులను పిలిచి మందలించి ఈ వ్యవహారాన్ని సరిదిద్దేలా పునరాలోచన చేయాలని కోరుతున్నాం. తెలుగుదేశం హయాం లో ఎవరు అయితే అధికారులు గా చెలామణీ అయ్యారో వారే నేడు కూడా పరిపాలిసుండడం ఒకింత బాధ కలిగిస్తోంది.
.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉన్నారు. కేబినెట్లో స్థానం కల్పించడమే కాక ఎందరో బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం, రాజకీయ పునరావాసం కల్పించారు. మీ హయాంలో కేబినెట్లో స్థానం లేనప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి, చీఫ్ సెక్రటరీగా మా సామాజికవర్గ అధికారిని చూసి మీరు కూడా తండ్రి బాటలోనే మాకు అండగా ఉంటున్నారు అంటూ మా సామాజికవర్గం వేద ఆశీర్వచనాలు అందజేస్తోంది. మేము అల్పసంతోషులం. అయితే చీఫ్ సెక్రటరీ మరియు జె ఎస్ వి ప్రసాద్ ల వరుస పరిణామాలు వల్ల మేము మనస్తాపం చెందుతున్నాము. ఈ జరిగిన పరిణామాలు మీ వల్ల జరిగింది కాదు. ప్రభుత్వంలోనూ లోపం లేదు. కానీ కొందరు అధికారులు వల్ల జరిగిన పరిణామాలు మా లో బాధాకరంగా, ఆందోళనగా మారాయి. దీనిపై మీరు పునరాలోచన చేసి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ..

ద్రోణంరాజు రవికుమార్, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు, విజయవాడ.

Share on facebook
Share on twitter
Share on whatsapp