ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లను ఆమె దాఖలు చేశారు. వాటిలో మొదటి సెట్ లో ఆమె అభ్యర్థిత్వాన్ని మొదట ప్రధాని మోడీ, ఆయన తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు.
రెండవ సెట్ లో ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. మూడవ సెట్ లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ఎమ్మె్ల్యేలు, ఎంపీలు ప్రతిపాదకులుగా ఉన్నారు.
నాలుగవ సెట్ లో గుజరాత్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఏఐడీఎంకే నాయకులు పన్నీర్ సెల్వం, తంబిదురై జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ లు కూడా హాజరయ్యారు.