భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ద్రౌపది ముర్మతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ ప్రమాణం చేయించారు.
ఈరోజు ఉదయం మొదట రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి ఫోర్ కోర్టులో రామ్ నాథ్ కోవింద్ తో కలిసి ఆమె గౌరవ వందనం స్వీకరించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, వివిధ పార్టీల నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది ముర్ముకు 21 గన్ సెల్యూట్‌తో కేంద్ర హోంశాఖ గౌరవ వందనం సమర్పించింది. తనపై ప్రజల విశ్వాసం తనకు బలాన్నిచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోందని, ఇలాంటి ముఖ్యమైన సమయంలో తనకు ఈ బాధ్యత వచ్చిందన్నారు.