కర్నాటకలో డ్రగ్స్ దందా మరోసారి కలకలం రేపింది. ఈ సారి ఏకంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై భద్రతా సిబ్బంది ఈ దందా చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సీఎం భద్రతా సిబ్బందిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివకుమార్, సంతోష్లుగా నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఆర్‌టీ నగర్లోని సీఎం నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. నిందితులు.. డ్రగ్స్ వ్యాపారం చేసేవారిని నుంచి మాదకద్రవ్యాలు తీసుకొని కస్టమర్లు అమ్ముతున్నారని తెలిపారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సీఎం నివాసం సమీపంలోని డన్జో ద్వారా డ్రగ్స్ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. డ్రగ్స్ వ్యాపారులకు, వీరికి లావదేవీల విషయంలో వాగ్వాదం జరిగడంతో.. అనుమానించిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే సమయంలో కానిస్టేబుళ్లు సాధారణ దుస్తుల్లో ఉన్నారని పోలీసులు చెప్పారు.
మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారులు అమ్జద్ ఖాన్, అఖిల్ రాజ్ తో వారు ఈ దందా చేస్తున్నామని విచారణలో నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. కానిస్టేబుళ్లతో పాటు ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ అంశం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.