– ఏటా వెయ్యి కోట్ల డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న టోని
– నెలకు రెండు సార్లు రవాణా
– కెల్విన్ తో బయటపడ్డ వ్యవహారం
– ఇన్నాళ్లూ మౌనం వహించిన సర్కార్
– గతంలో అందరి ముందే అకున్ సబర్వాల్ ని ఓవర్ యాక్షన్ అన్న సీఎం
– 34 మంది వ్యాపారస్థులు మాత్రమే ఉన్నారా?
– ఆ టీఆర్ఎస్ నేతలను తప్పించడానికేనా కేసీఆర్ హడావుడి?
– లేక మ్యాటర్ డైవర్ట్ చేయాడానికా..?
తెలంగాణలో డ్రగ్స్ పుట్ట పగలబోతుందని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రత్యేక కౌంటర్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. గంజాయి పండించిన వారి సమాచారం ఇవ్వకపోతే.. గ్రామం మొత్తం రైతు బంధు బంద్ అంటూ హెచ్చరించారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు కేసీఆర్ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువస్తారనే ఆరోపణలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ చుట్టేస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ హడావుడి కూడా అందులో భాగంగానే జరుగుతుందని అంటున్నారు. డ్రగ్స్ డీలర్ టోనిని శనివారం నుంచి 5 రోజులపాటు విచారించనున్నారు. ఇప్పటికే 34 మంది వ్యాపారస్థులను కస్టడికి ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే టోని నోరు విప్పితే ఏం జరగబోతుంది. నికార్సైన దర్యాప్తు చేసే దమ్ము తెలంగాణ పోలీసులకు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ గుట్టురట్టు చేయాలంటే ఎన్సీబీ దర్యాప్తు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
తెలంగాణలో డ్రగ్స్ చరిత్ర..
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో డ్రగ్స్ కేసు సినిమా ఇండస్ట్రీని గడగడలాడించింది. మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని అకున్ సబర్వాల్ ని ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. 21 మంది సినిమా పెద్దలను విచారణకు పిలిచి హడావుడి చేశారు. ఈ హడావుడి అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ భూ సేకరణ వ్యవహారంపై జరుగుతున్న ఆందోళనలను డైవర్ట్ చేసేందుకే అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పోలీస్ ఉన్నతాధికారుల ముందే కేసీఆర్ అకున్ సబర్వాల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు వేగం తగ్గింది. సిట్ విచారణ ముగిసింది. తరువాత డ్రగ్స్ కేసులో ఉన్న వారందరికి క్లిన్ చిట్ ఇచ్చి వారంతా బాధితులేనని చార్జీషీట్లలో పేర్కొన్నారు. కెల్విన్ తో పాటు పట్టుపడ్డవారిని మాత్రమే నింధితులుగా చేశారు. కానీ 5 ఏళ్లు గడుస్తున్నా.. ఆ కేసుల్లో ఎవరికీ శిక్షలు పడలేదు. పైగా అందరిని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుని క్లిన్ చీట్ ఇచ్చారనే అపవాదు కేసీఆర్ పై ఉంది.
కెల్విన్ టూ టోని వయా టీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
కెల్విన్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవాడు. టోని ముంబాయి నుంచి తీసుకొచ్చాడు. కెల్విన్ సినిమా ఇండస్ట్రీ ఇవెంట్స్ తో పాటు స్టూడెంట్స్ కి అమ్మేవాడని ఎక్సైజ్ శాఖ తెల్చింది. టోని డ్రగ్స్ దందాలో వ్యాపారవేత్తలు మాత్రమే బయటపడ్డారు. కానీ.. వీరందరిని నడిపించే శక్తి ఒకటి ఉందని తెలుస్తోంది. ఆ శక్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా కేసీఆర్ నియమించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో కూడా ఆ ఎమ్మెల్యే పేరు ఉంది. ప్రతిపక్షాలు నోరెత్తితే.. ఒంటికాలి మీద లేవడం ఆ ఎమ్మెల్యేకి బాగా అలవాటు. ఓ ఖరీదైనా హోటల్ లో సూట్ వేసుకోని 5 ఏళ్లుగా డ్రగ్స్ మాఫియాను శాసిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ దందా నడవాలి అన్నా.. అధికార పార్టీ నుంచి అండదండలు, హామీలు అవసరమని గత అనుభవాలు చెబుతున్నాయి. దీంతో.. నిగ్గు తెల్చాల్సిన పోలీసులు ఈ విషయంలో ఏం చేస్తారని ఆసక్తిగా మారింది. కేసుల నుంచి తప్పించుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుంటారు. బెంగుళూర్ లో ఓ డ్రగ్స్ కేసులో తాండుర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. విచారణకు కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ పార్టీకి అంటెండ్ అయ్యారు కానీ.. డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. బెంగుళూరు పోలీసులే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర నిగ్గుతెల్చలేకపోయారు. అలాంటిది ఇక్కడ అధికారంలో ఉంటే వాళ్ల పేర్లు బయటకు వాస్తాయా? అని బిలియన్ డాలర్ల ప్రశ్న.
కేసీఆర్ హడావుడితోనే అనుమానాలు..?
ముఖ్యమంత్రి ఏదైనా వరుసగా మూడు రోజులు మాట్లాడితే.. దాని వెనుక ఎన్నో రకాల లాభాలను ఆలోచిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు డ్రగ్స్ కేసును మరోసారి వాడుకునేందుకు సిద్దమయ్యారు. ఏడేళ్లుగా గంజాయి, డ్రగ్స్ దందా వేల కోట్లలో నడుస్తుంది. ఇది ఇప్పుడే పుట్టింది కాదు. ఇప్పుడే అంతమయ్యేది కాదు. అలాంటి డ్రగ్స్ కేసుతో మీడియాలో రాబోయే కథనాలను డైవర్ట్ చేయడానికే ఈ హడావుడి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటిసారిగా వాడకం జరిపిన వారిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. అధికార పార్టీ నేతల పాత్రపై నిగ్గు తెలుస్తారా? కనీసం ఆ దిశగా విచారణ ఉంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. కేసీఆర్ హడాహుడి తప్ప.. అసలైన సూత్రదారులు, పాత్రదారులను అరెస్ట్ చేసే అవకాశాలు లేవని తెలుస్తుంది.