డ్రగ్స్ కల్చర్‌ను నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా గుట్టుగా వారి దందాను కొనసాగిస్తున్నారు అక్రమార్కులు. యువకులు, విద్యార్థులే టార్గెట్‌గా విక్రయాలు సాగిస్తున్నారు.
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ముఠా సభ్యులు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 25 గ్రాముల హాష్ ఆయిల్, 2 మొబైల్స్, బైక్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులను రమేష్(21), సాయి ప్రకాష్(19తో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న సాయి కుమార్, నవీన్ కుమార్ అనే యువకులు ఉన్నారు.
ఈ ఘటనపై డీసీపీ చందనా దీప్తి మాట్లాడుతూ.. డ్రగ్స్ గంజాయి వంటి మారక ద్రవ్యాలు అమ్మిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత రెండేళ్లుగా ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. పోలీసులు ప్లాన్ వేసి చాకచక్యంగా వారిని పట్టుకున్నారని వివరించారు.
జల్సా కోసం స్నాచింగ్.. వారే టార్గెట్..
అంతర్ జిల్లా చైన్ స్నాచర్లను నార్త్ జోన్ పరిధిలోని పోలీసులు అరెస్టు చేశారు. బైక్‌పై తిరుగుతూ ఒంటరి మహిళలే టార్గెట్‌గా స్నాచ్చింగ్స్‌కి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైనా నిందితులను రంజిత్, రాజశేఖర్‌లుగా గుర్తించారు. వీరిపై గతంలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదు అయినట్లు వివరించారు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి మొత్తం 3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రెండు వాహనాలు, నాలుగు మొబైల్స్ సీజ్ చేశారు. ఇద్దరి నిందితులపై పిడీ యాక్ట్ నమోదు చేశారు.