పెళ్ళవుతుందన్న పట్టలేని ఆనందం ఓవైపు బ్యాచిలర్ లైఫ్ ఎండ్ అవుతుందన్న బాధమరోవైపు… వెరసి ఫుల్ మందు పార్టీ. అంతే..! తప్పతాగిన వరుడు బ్యాలెన్స్ తప్పి ఏకంగా పెళ్ళిపీటలమీదే హాయిగా పడుకున్నాడు.
పెళ్లికొడుకు నిర్వాకం కళ్ళారా చూసిన వధువు తనకీ పెళ్లి వద్దంటే వద్దని తేల్చిచెప్పింది. సొంత పెళ్లికి స్ఫృహ లేకుండా తాగిన వరుడిని పెళ్లాడేదిలేదని తెగేసి చెప్పేసింది పెళ్ళికూతురు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసోంలోని నల్ బరీలో చోటుచేసుకుందీ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లి ఏర్పాట్ల కోసం తాను వెచ్చించిన సొమ్మును వరుడి తరపువారి నుంచి ఇప్పించాలంటూ వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సమాచారం ప్రకారం. నల్ బరీకి చెందిన ప్రసేన్ జిత్ హలోయ్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది.
వివాహం గ్రాండ్ గా జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే, ప్రసేన్ తో పాటు ఆయన తండ్రి, ఇతర బంధువులు ఫూటుగా మద్యం సేవించడంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభాసాగా మారింది. పెండ్లిపీటలపైన కూర్చోలేక వరుడు అక్కడే నిద్రపోయాడు.
మద్యం మత్తులో తూగుతున్న వరుడి బంధువుల పరిస్థితి చూసి పెళ్లికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఆపై పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఈ నెల 7న నల్ బరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Video: "Drunk" Groom Sleeps At His Own Wedding. This Happened Next https://t.co/e29q2ZgBBm pic.twitter.com/LEZgRtXbJc
— NDTV (@ndtv) March 11, 2023