తాగిన మైకంలో భార్య పై దాడి చేశాడు ఓ భర్త. విశాఖపట్నం పాయకరావుపేట పట్టణం చెక్కానగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మేరీ కమలాక్షి పాయకరావుపేట పట్టణం నాగ నరసింహ ప్రైమరీ స్కూల్ లో ఉపాధ్యాయురాలు గా పని చేస్తుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు బాబు, పాప ఉన్నారు. ఘటన జరిగిన సమయంలోనే మేరీ కమలాక్షి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.