వేదికపై మాట్లాడుతున్న ఓ బీజేపీ నేతకు షాక్ ఇచ్చాడు ఒక తాగుబోతు. వేదిక పైకి ఎక్కి బీజేపీ నేత ముఖంపై ప్లాస్టిక్ కవర్ ను విసిరాడు. దీంతో ఒక్కసారిగా బీజేపీ నేత షాక్ కి గురై, ఆ తాగుబోతును పక్కకి తీసుకెళ్లమని కార్యకర్తలకు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని బెట్టియాలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జై స్వాల్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
BJP का मंच और सामने शराबी! बेतिया में शुक्रवार को बीजेपी का कार्यक्रम था. इसी दौरान मंच पर एक शराबी पहुंच गया. देखिए कैसे बीजेपी प्रदेश अध्यक्ष संजय जायसवाल ने नीतीश कुमार पर चुटकी ली. वीडियो- बेतिया से कैलाश.Edited by @iajeetkumar pic.twitter.com/AllupsnWBj
— Prakash Kumar (@kumarprakash4u) October 1, 2022
వేదికపై సంజయ్ జైస్వాల్ మాట్లాడుతున్న తరుణంలో.. అక్కడికి మద్యం సేవించి ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు. ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి సంజయ్ కాళ్లకు నమస్కరించి, ముఖంపై ప్లాస్టిక్ కవర్ విసిరాడు. దీంతో షాకైన బీజేపీ నేత ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ కార్యకర్తలకు సైగ చేశాడు. దీంతో మద్యం సేవించిన వ్యక్తిని వేదిక నుంచి కిందకు తీసుకెళ్లారు.
మరోవైపు ఈ సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ప్రయత్నించారు. మొన్నటి వరకు బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి ఉన్న సీఎం నితీశ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు.
నితీశ్ జీ హయాంలోని లిక్కర్ కహానీ మన కళ్ల ముందు ఇలా కనిపిస్తుందని విమర్శలు చేశారు. కాగా మహారాష్ట్రలోని శివసేనను మాదిరిగా బీహార్‌లో జేడీను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది. దీంతో నితీశ్ కుమార్ అప్రమత్తమయ్యారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.