బారో,బెల్టుషాపో అతనిలో కాస్త ధైర్యాన్ని నింపింది. దీంతో ఒకరిద్దరుగా కనిపించడం మొదలెట్టారు. నిమాషాల్లో ఇండియా జనాభా చైనాను దాటిపోయినట్టనిపించింది అతనికి. తాగిన నాలుగు పెగ్గులు ధైర్యంతో పాటూ స్వేచ్ఛా,సమానత్వాన్ని పెంచాయి.
ఇంత పెద్ద సమాజంలో ఫోన్ నంబర్ అడిగితే పెద్ద తప్పేంటనుకున్నాడు.కాకపోతే ఆ ఫోన్ నంబర్ ఓ మహిళ అడిగాడు. అంతే ! తర్వాత ఏమయ్యిందో అతనికి తెలియరాలేదు. ఇంకెప్పుడూ ఎవర్నీ ఫోన్ నంబర్ అడగ కూడదని తెలిసొచ్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ధర్వాడా జిల్లాలోని శుభాష్ రోడ్డులో తూలుతూ కనిపించాడు. అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి.. ఆమె ఫోన్ నంబర్ అడిగాడు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. చుట్టుపక్కల ఉన్న జనానికి ఛాన్స్ దొరికింది మహిళకు సపోర్ట్ గా నిలిచారు.
తాగితే తాగావు ఫోన్ నంబర్ ఎందుకు అడిగావు అనిచివాట్లు పెట్టారుజనం. ఈ తన్నుల తంతుని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది.ఈ లెక్కన ఈ డిసెంబర్ 31 కి ఎన్నిచెప్పులు విరుగుతాయో అనుకుంటున్నారు నెటిజన్లు.
A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL
— Imran Khan (@KeypadGuerilla) December 30, 2022