మద్యం మత్తులో చేసిన విన్యాసం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కొత్త సంవత్సరం అందరికీ సరికొత్త ఆశలతో మొదలైతే అతని కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. తమిళ నాడు కడలూరు జిల్లాలో డిసెంబరు 31 రాత్రి నూతన సంవత్సరం వేడుకల్లో జరిగిన ఈ ఘటన పండగ వాతావరణాన్ని మరణ వార్తగా మార్చేసింది. నూతన సంవత్సర వేడుకలలో మణికందన్ అలియాస్ పప్పు అనే వ్యక్తి అప్పటి దాకా మద్యం సేవించి వచ్చాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ పామును చూసి అత్యుత్సాహంతో పట్టుకున్నాడు.
తర్వాత దాన్ని న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ అతని స్నేహితులకు చూపిస్తూ ఆట పట్టించాడు.అరిచాడు.అది చూసిన వారంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీసారు.అయితే రెప్పపాటులో ఆ పాము మణికందన్ ను కాటేసింది. వెంటనే అతడు స్పృహ తప్పి పడిపోయాడు.
అపస్మారక స్థితిలో ఉన్న మణికందన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.మణకందన్ తో పాటు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదే పాము కాటేసింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాటేసన పామును స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్ళగా అది రసెల్ జాతి సర్పమని వైద్యులు పేర్కొన్నారు.