డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని ఆపినందుకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైనే దాడి చేశాడో వ్యక్తి. మాదాపూర్ లో జరిగిందీ ఘటన. బండి ఆపినందుకు ఒక్కసారిగా సిబ్బందిపైకి దూసుకొచ్చాడు వాహనదారుడు. ముందుగా కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిలువరించేదుకు ప్రయత్నించగా.. అతనిపై దాడికి పాల్పడ్డాడు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాడి చేసిన వ్యక్తి ఉన్నతాధికారి బంధువు కావడంతో పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచారు.