హైదరాబాద్: గణేష్ నిమజ్జనోత్సవాల కోలాహలంలో సందట్లో సడేమియా మాదిరిగా కొంత మంది అత్యుత్సాహం వింతగా ఉంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణేష్ శోభాయాత్ర విధుల్లో తీరికలేని పోలీసు అధికారుల ఎదుటే కొంత మంది భక్తులు వీరంగం వేశారు.
ఓ మహిళ వెయ్ చిందేయ్ అంటూ డ్యాన్స్ రాచకొండ పోలీసుల ముందు డ్యాన్స్ చేసి అలరించింది. వింత డ్యాన్స్ ఉత్సవాల్లో భక్తులకు ఓ సరదాగా మారింది.
టిక్ టాక్ వీడియో కోసం ఆమె అలా చేసింది. పోలీసుల ముందే డ్యాన్స్ చేస్తూ నవ్వులు చిందిస్తున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్యాంక్ బండ్‌పై గణనాథుల నిమజ్జన కార్యక్రమ విధుల్లో ఉన్న పోలీస్ అధికారితో ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం తాగిన అతను అలా వింతగా ప్రవర్తించడంతో అంతా అటువైపు చోద్యం చూశారు. పోలీసులు కోపం అదుపులో ఉంచుకుని మందుబాబును సున్నితంగా, సరదాగా కంట్రోల్ చేశారు.
పోలీసులు వింత ఈవెంట్లను సరదాగా తీసుకున్నారు. నిమజ్జనం ఉత్సాహంలో ఇలాంటి వింత డ్యాన్సులు షరా మామూలే..!