జీతు జోసెఫ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం 2. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే మలయాళంలో సూపర్ హిట్ సాధించిన సినిమాకు రీమేక్ ఈ చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
అలాగే అక్టోబర్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అలాగే డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.