నిజామాబాద్: నిజంగా తాను తప్పుచేస్తే యాక్షన్ తీసుకోవడానికి టీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్, రాజ్యసభ సభ్యుడు డీఎస్. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన దరిమిలా తప్పు చేశానని తనపై టీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ఆరోపణలపై డీఎస్ స్పందించారు. దేశానికి హోం మంత్రిగా ఉన్నాడనే అమిత్ షాను కలిశానని చెప్పారు. అది కూడా తాను బీజేపీ ఆఫీస్‌లో కలవలేదని చెప్పారు అసలు తాను కాంగ్రెస్‌ను వీడటమే ఆశ్చర్యం కలిగించే విషయమని అంతకంటే ఆశ్చర్యం ఏముంటుందని అన్నారు. తన కుమారుడు అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచాడని, అతని సిద్ధాంతాలు అతనికి ఉంటాయని అన్నారు. తెలంగాణపై భారతీయ జనతాపార్టీ ఫోకస్ చేసిందని అన్నారు. అనవసరంగా దేనిపైనా స్పందించడం అలవాటు లేదని, ఏదైనా స్పందించాల్సి వస్తే గట్టిగానే స్పందిస్తా అని బదులిచ్చారు డీఎస్.