తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోందన్న వార్తలపై దళిత శక్తి ప్రోగ్రాం కన్వీనర్ విశారదన్ స్పందించారు. తొలి వెలుగుతో మాట్లాడుతూ కొత్త పార్టీ పెట్టే ఆలోచన మాకు లేదన్నారు.
కేవలం మా ప్రయత్నం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ వర్గాలను చైతన్య పరచడమే అన్నారు.విద్య, వైద్య , ఉపాధి లో బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దళితులు బానిసలు కాదు, మహారాజులు మీరే అని వారిని శక్తివంతులుగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
ఒకవేళ రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, కాన్షిరాం స్థాపించిన బీఎస్పీ ఉండగా, కొత్త పార్టీ స్థాపించే అవసరం మాకు లేదన్నారు.
దళిత శక్తి ప్రోగ్రాం కేవలం సామాజిక, సాంస్కృతిక చైతన్యం కోసమే అని తొలి వెలుగు తో చెప్పారు విశారదన్