డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీల స్నేహాం ఇండస్ట్రీలో, సినిమా రంగంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సుకుమార్ ఎలా మాయ చేస్తాడో… దేవీ కూడా తన మ్యూజిక్‌తో మైమరిపిస్తాడు. కానీ ఈ మధ్య దేవీ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి చాలా కాలం అయింది. తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా పాటలు దేవీశ్రీ స్థాయిలో మాత్రం లేవు. అయినా తన ఫ్రెండ్‌పై ఉన్న నమ్మకాన్ని మాత్రం సుకుమార్ ఏమాత్రం తక్కువ చేయటం లేదు.
సెగలు పుట్టిస్తున్న యాంకర్ రష్మీ ఫోటోలు
ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న అల వైకుంఠపురంలో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్‌కు అది 20వ సినిమా. ఈ సినిమాకు సుక్కు దేవీకి చాన్స్ ఇస్తాడా అని అంతా అనుకున్నా… మరోసారి తన ఫ్రెండ్‌నే నమ్ముకున్నాడు సుకుమార్. గతంలో మాయ చేసినట్లుగా తన ఫాంను తిరిగి అందుకుంటాడు అన్న నమ్మకంతోనే మరోసారి దేవీశ్రీ వైపే మొగ్గుచూపాడు. మరీ దేవీ ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
ఉత్తమ కామాంధుడు పురస్కారం ఇస్తారని ఆశిస్తున్నా
Advertisements
సల్మాన్ ఖాన్ బర్త్ డే లో మెరిసిన తారలు