ఐపీఎల్ లో పవర్ ఫుల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాయకత్వానికి విరాట్ కోహ్లీ గతేడాది వీడ్కోలు పలికారు. దీంతో ఆర్సీబీ పగ్గాలు ఎవరికి అందుతాయనే టెన్షన్ అభిమానులకు నిద్ర పట్టనివ్వలేదు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది కూడా కోహ్లీకే కెప్టెన్సీ ఇస్తారంటూ ప్రచారం జరిగింది.
దీంతో మరోసారి అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అయితే.. ఈ ఊహలకు ఫుల్‌స్టాప్ పెట్టిన కోహ్లీ.. తన నుంచి జట్టు పగ్గాలు అందుకున్న ఆటగాడి పేరు వెల్లడించాడు. సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డు ప్లెసిస్ ను ఈ ఏడాది ఆర్సీబీ కొనుగోలు చేసింది.
అతనికే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు అందించినట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ప్రకటించింది. ఇక నుంచి ఈ సింహాల గుంపుకు నాయకుడు ఇతనే అంటూ డుప్లెసిస్ ఫొటోను రివీల్ చేసింది.
ఇప్పటి వరకు డుప్లెసిస్ ఐపీఎల్ లో 100 మ్యాచులు ఆడాడు. అతన్ని మెగావేలంలో రూ.7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.