ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ మనుషులపైనే కాదు…ఉత్తత్తి సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపచంలోనే అతి పెద్ద కార్ల ఫ్యాక్టరీ హ్యుందాయ్ దాని దెబ్బకు మూతపడే పరిస్థితి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల ఫ్యాక్టరీలో శుక్రవారం ఆపరేషన్స్ నిలిపివేశారు. దీంతో దక్షిణ కొరియాలోని పచ్చసముద్ర తీరంలో ఉన్నఅతిపెద్ద హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీ ఉల్సన్ కాంప్లెక్స్ బోసిపోయి ఉంది. దీనికంతటికి కారణం కార్ల తయారీకి కావాల్సిన విడిభాగాల దిగుమతి చైనా నుంచి నిలిచిపోవడమే.
దక్షిణ కొరియాలోని సముద్ర తీరంలో ఐదు ప్లాంట్ల నెట్ వర్క్ ఉన్న ఈ ఫ్యాక్టరీలో సంవత్సరానికి 14 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇతర దేశాల నుంచి కార్ల తయారీకి కావాల్సిన ముడి సరుకును, విడి భాగాలను దిగుమతి చేసుకోవడం…ప్రపంచ దేశాలకు కార్లను ఎగుమతి చేయడం ఇక్కడి నుంచే జరుగుతుంది. అయితే చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపించి ఆర్డర్ ఫ్యాక్టరీలన్ని మూతపడ్డాయి. చైనా నుంచి రావాల్సిన ముడి సరుకు, విడిభాగాల దిగుమతి నిలిచిపోయింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల ధరల పెరగడంతో సప్లయ్ కష్టంగా మారింది. ఫలితంగా హ్యుందాయ్, దాని అనుబంధ సంస్థ, ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ కియా వెహికిల్స్ కు కనెక్ట్ చేసే వైరింగ్ చైనా నుంచి దిగుమతి నిలిచిపోవడంతో ఉత్పత్తిని ఆపేశారు.
ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో 25 వేల మంది కార్మికులకు సగం జీతం ఇస్తూ బలవంతంగా సెలవుపై పంపించారు. వీరందరు ఆరోగ్యవంతమైన కరోనా బాధితులు. ” పని లేకుండా జీతం తీసుకోవడం చాలా సిగ్గనిపిస్తుంది…మనసంతా ఎలాగో ఉంది” అని హ్యుందాయ్ ఫ్యాక్టరీ కార్మికుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడతాయనడానికి హ్యుందాయ్ పనులు నిలిచిపోవడమే మొదటి ఉదాహరణగా చెప్పుకోవచ్చని మార్కెట్ ఎనలిస్ట్ విశ్లేషిస్తున్నారు. హ్యుందాయ్ మూసివేత ప్రభావం ఎంత ఉందో వింటో కళ్లలో నీళ్లొస్తాయి. ఐదు రోజులు ఫ్యాక్టరీ విలువ 500 మిలియన్ల డాలర్లు అని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
హ్యుందాయ్ ఒక్కటే కాదు…సోమవారం నుంచి కియా కూడా మూడు ప్లాంట్లను నిలిపి వేయనుంది. ఫ్రెంచ్ ఆటో మేకర్ రినాల్ట్ సౌత్ కొరియా ఫ్యాక్టీరిలో వచ్చే వారం నుంచి పనులు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. యూరోఫియన్ ఫ్యాక్టరీల్లో ఒకటైన ఫియట్ కంపెనీ కూడా బలవంతంగా పనులు నిలిపివేయనున్నట్టు తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా చైనా ల్యూనార్ న్యూ ఇయర్ సెలవులను మరి కొన్ని రోజులు పొడిగిస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ సోకి 636 చనిపోగా..31000 మందికి వ్యాధి సోకింది. చైనాలో వ్యాపించిన ఈ కరోనా వైరస్ ను ఏ విధంగా నాశనవుతుందో అర్ధం కావడం లేదని కొరియాలోని ఇన్హా యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెయాంగ్ ఇన్-క్యో అన్నారు. ”దక్షిణ కొరియా కంపెనీలు ముడిసరుకు, విడి భాగాల కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడతాయి…అందులో ఒక్క పార్ట్ లేకపోయినా..పనంతా ఆగిపోతుంది” అని చెప్పారు. ఈ అంతరాయం ఆరంభం మాత్రమే ఇది మరింత తీవ్రమై ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ”ఇది చైనాలో తయారు కాదు..అనేది ఒక్కటి లేదు” అన్నారు
వస్తు ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్దది. దాని వాణిజ్య భాగస్వామి అమెరికా దాని కంటే చాలా దూరంలో ఉంది. అమెరికాకు ఎగుమతులన్నీ చైనా, హాంకాంగ్ కలిసే చేస్తాయి. ఫైనాన్సియల్ హబ్ నుంచే నౌకల ద్వారా ఎగుమతవుతాయి. గత ఏడాది అమెరికాకు జరిగిన ఎగుమతుల విలువ 450 బిలియన్ డాలర్లు. అదే జపాన్ కు 150 బిలియన్ డాలర్లు. దక్షిణ కొరియా, వియత్నాం దేశాలు చైనా నుంచి చేసుకొని దిగుమతి విలువ 1000 బిలియన్ డాలర్లు. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ సప్లయ్ చైన్ లో చైనా అంతర్బాగంగా ఉంది.