కరోనా వైరస్ కారణంగా చైనాలో అన్ని పనులు ఆగిపోయాయి. వైరస్ విజృంభిస్తుండంతో శుభకార్యాలు, పెళ్లిల్లు కూడా వాయిదా పడ్డాయి. ప్రాణాంతక వైరస్ విజృంభిస్తుండడంతో ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకుంది. ఆర్భాటాలు, అట్టహాసాలు లేకుండా ఆ జంట చాలా సాదా సీదాగా ఒక్కటయ్యింది. పెళ్లి కూతరు పేరు వాన్ యూషింగ్, హాస్పిటల్లో నర్సు, పెళ్లి కుమారుడు కిన్ దుషన్ అగ్ని మాపక దళ ఉద్యోగి. కరోనా వైరస్ కారణంగా తమ పెళ్లిని వాయిదా వేసుకోవద్దనుకున్న ఆ జంట ఆన్ లైన్ లో పెళ్లి చేసుకుంది. మొబైల్ ఫోన్ లో అటు నుంచి అబ్బాయి…ఇటు నుంచి అమ్మాయి, ఆమె స్నేహితులు లైవ్ లో కనెక్ట్ అయి జీవితాంతం ఒకరినొకరం తోడుగా వుంటామని బాస చేశారు. కలిమి లోను, లేమి లోను కలిసి వుంటామని ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు. ఈ పెళ్లి తంతు 5 నిమిషాల్లోనే ముగిసింది. కరోనా వైరస్ తగ్గినాక మరోసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వారి పెళ్లిని వేలాది మంది చూశారు. వందలాది కామెంట్స్ పెట్టారు. వారిని అభినందిస్తూ కొందరు కామెంట్స్ పెట్టగా… ఈ పరిస్థితుల్లో ఈ పెళ్లి అవసరమా అని మరి కొందరు విమర్శించారు.