శరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విశిష్ఠ అవతారమూర్తిని దర్శించుకునేందుకు భక్త కోటి అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. దర్శనం కోసం నాలుగు గంటల పాటు భక్తులు క్యూలైన్‌లో ఉండాల్సి వస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. వీఐపీల పేరుతో ఇష్టానుసారం అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా రాజకీయ నేతల హడావుడి, పోలీసుల ఓవరాక్షన్ ఈసారి కనిపిస్తోంది.

ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దధ్యోదనం, పరమాన్నం, గారెలు లాంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇదేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్నయినా దానం చేయాలి. ఇంట్లో ఎప్పుడూ ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు. ఆ ఆకలిని కలిగించే ఆర్థికబాధలూ ఉండవు. అకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ. అందుకనే సంతానం కావాలనుకునేవారు దసరాల్లో అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది.