వైభవంగా తెప్పోత్సవం - Tolivelugu

వైభవంగా తెప్పోత్సవం

, వైభవంగా తెప్పోత్సవం

విజయవాడ : శరన్నవరాత్రులు పత్యేక రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్న బెజవాడ కనక దుర్గమ్మ ఉత్సవాల్లో చివరిరోజు మల్లేశ్వరునితో కలిసి నదీ విహారం చేశారు. భక్త కోటి కనులారా చూస్తుండగా కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు నదిలో తెప్పోత్సవానికి బయల్దేరారు. తెప్పోత్సవానికి ముందు ఈవో సురేష్ బాబు కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాల చివరిరోజు దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. మేళా తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్యాలు భక్తకోటిని ఆకట్టుకున్నాయి.

, వైభవంగా తెప్పోత్సవం

Share on facebook
Share on twitter
Share on whatsapp