పోలీసులు ఎంత కట్టుదిట్టం చేస్తున్నా మాదక ద్రవ్యాల మాఫియా విషం కక్కుతూనే ఉంది. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు పోలీసులు. 84 కోట్ల విలువ చేసే 12 కేజీల హెరాయిన్ సీజ్ చేసారు DRI అధికారులు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న DRI అధికారులు ముంబై ఎయిర్ పోర్ట్ లో మాటువేసి అనుమానాస్పదంగా కనిపించిన జింబాబ్వే ప్రయాణికురాలిని DRI బృందం తనిఖీ చేయడంతో మాదక ద్రవ్యాల అక్రమరవాణా ఉదంతం బైటపడింది.
అయితే ఎటువంటి అనుమానం రాకుండా ప్లాస్టిక్ కవర్స్ లో హెరాయిన్ ప్యాకింగ్ చేసి ఫైల్ ఫోల్డర్ మద్య లో దాచి తరలించే ప్రయత్నం చేసింది నిందితురాలు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో DRI నిఘావర్గాలు ఆమెని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు.
సాధారణ పద్ధతుల్లో ప్రశ్నించగా నోరువిప్పని నిందితురాలు..నిఘాబృందం తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఫైల్ ఫోల్డర్ లో దాచిన హెరాయిన్ విషయం బైటపడింది. నిందితురాలి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి DRI దర్యాప్తు కొనసాగిస్తోంది.