మన దేశంలో భోజనం విషయంలో చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు. భోజనం ఎలా పడితే అలా చేయవద్దని మన చరిత్ర కూడా బలంగా చెప్తుంది. ఇక భోజనానికి సంబంధించి కొన్ని ఖచ్చితంగా పాటించాలని పెద్దలు వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి వాటిల్లో భోజనం తర్వాత స్నానం చేయకపోవడం, అలాగే భోజనం చేసే సమయంలో గాని భోజనం చేసిన తర్వాత గాని ఒళ్ళు విరవకూడదు అని.
Also Read:స్విమింగ్ పూల్ లో కోమాలోకి..
అసలు ఒళ్ళు ఎందుకు విరవకూడదు అనేది ఒకసారి చూద్దాం. భోజనం చేసే వేళ చాలా శ్రద్ధగా ఉండాలని చెప్పిన పెద్దలు ఒళ్ళు విరుచుకుంటే, ఒక అన్నం మెతుకు అయినా సరే ఊపిరితిత్తులలోకి వెళ్తే గనుక ప్రాణాల మీదకు వస్తుందని. అన్నం గనుక ఊపిరి తిత్తులలోకి వెళ్ళింది అంటే కచ్చితంగా ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు. మనం మంచి నీళ్ళు తాగే సమయంలో కూడా ఉక్కిరిబిక్కిరి అయి ముక్కు లోకి పోయి ఇబ్బంది పడతాం.
ఒక్కోసారి ఎక్కిళ్ళు కూడా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక పెద్దలు చెప్పినవి కొన్ని చూస్తే… భోజనం చేసేవేళ మాట్లాడితే కూడా మాటల్లో నవ్వుకుంటే ఊపిరి తిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉందట. తినేదాని మీద శ్రద్ధ ఉండాలట. అలాగే ఒక్కో ముద్దని 32 సార్లు నమిలితే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ముందు మంచినీళ్లు పెట్టి తరువాత భోజనం వడ్డించాలి లేకపోతే ఎక్కిళ్ళు వచ్చినా, కారం -ఘాటు ఎక్కువయినా సరే తినే సమయంలో ఇబ్బంది పడతాం.
Also Read:వాళ్లిద్దరూ విడిపోతున్నారా…?