ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రులు.
స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించిన దుర్గగుడి అధికారులు
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ
అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరిసిపోతున్న శక్తిస్వరూపిణి
దసరా ఉత్సవాల నేపధ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి, దిగువున్న ఉన్న ఘాట్‌రోడ్డు, రావిచెట్టు సెంటర్, వినాయకుని గుడి క్యూ మార్గాలు
జై దుర్గా.. జైజై జగజ్జననీ అంటూ భక్తుల నామస్మరణతో మారుమ్రోగుతున్నఇంద్రకీలాద్రి
క్యూ మార్గాలలో చిన్నారులకు పాలు పంపిణీ
భక్తుల జల్లు స్నానాలతో కిటకిటలాడుతున్న దుర్గాఘాట్.
కేశఖండనశాలలో దుర్గమ్మకు పెద్దసంఖ్యలో తలనీలాలు సమర్పిస్తున్న భక్తులు
ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబసమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న భక్తజన సందోహం
ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల చుట్టూ పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
అమ్మవారి దర్శనానికి చేరుకునేందుకు వీఐపీలకు పున్నమి ఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు