కేసీఆర్ మొండి వైఖరి రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఇబ్బంది పెడుతోంది. ఆఖరికి చిన్నపిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయి. మామూలుగా అయితే దసరా హాలీడేస్ ఎంజాయ్ చేసి ఈపాటికే పిల్లలు బడులకు వెళ్లిపోవాలి. కానీ, ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు పొడిగించారు. సిలబస్ పూర్తయ్యేదెట్లా అనే ఆందోళన ఇప్పుడు టీచర్లది..
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసి సమ్మె నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దసరా సెలవులను పొడిగించారు. ఆర్టీసీ సమీక్షా సమావేశంలో సీయం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ తిట్టుకోకుండా స్కూళ్లకు సెలవులు ఇచ్చేయండి. పిల్లకాయలు ఇంటికాడ మరికొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు అని అన్నట్టు సమాచారం.
ఇలావుంటే, 19వ తేదీ నాటికైనా ఆర్టీసి సమ్మెకు తెరపడుతుందని నమ్మకం లేదు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఎలాంటి పరిస్థితి కనిపించట్లేదు అంటున్నారు ఆర్టీసీ యూనియన్ల నాయకులు. కార్మికులు సమ్మెకు ముగింపు పలుకుతారా లేదా అనేది చూడాలి.