మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ మరోసారి నూపుర్ కు మద్దతుగా నిలిచారు.
దేశం మొత్తానికి నూపుర్ క్షమాపణలు చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు ఆమె బాధ్యురాలంటూ ఉదయ్ పూర్ ఘటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించింది. ‘‘టెలివిజన్ చర్చలో ఓ వర్గాన్ని ఆమె ఎలా రెచ్చగొట్టారో చూశాం. అయితే.. ఇదంతా చెప్పి, ఆ తర్వాత తాను లాయర్ అని చెప్పిన తీరు సిగ్గుచేటు. అందువల్ల ఆమె ఈ దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి’’ అని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సుప్రీం వ్యాఖ్యల తర్వాత ప్రతిపక్ష పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
అయితే.. నెదర్లాండ్స్ నాయకుడు గీర్ట్ వైల్డర్స్ నూపుర్ ఎప్పటికీ క్షమాపణ చెప్పకూడదని అన్నారు. అలాగే.. ఉదయ్ పూర్ ఘటనకు ఆమె బాధ్యత వహించాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘ఉదయ్ పూర్ ఘటనకు జిహాదీలే బాధ్యులు. భారత్ లో షరియా కోర్టులు లేవని నేను అనుకున్నాను’’ అని గీర్ట్ వైల్డర్స్ ట్వీట్ చేశారు. అంతేకాదు నూపుర్ శర్మను హీరో అని అభివర్ణించారు ఎంపీ.
కొన్నాళ్ల క్రితం నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు మండిపడిన సమయంలోనూ గీర్ట్ వైల్డర్స్ ఆమెకు మద్దతుగా నిలిచారు. మహమ్మద్ ప్రవక్త గురించి నిజమే మాట్లాడిందని అన్నారు. ఆయన గురించి నిజాలు మాట్లాడినందుకు అరబ్, ఇస్లామిక్ దేశాలు నూపుర్ శర్మపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని.. భారతదేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. ఇస్లామిక్ దేశాలను చూసి బెదిరిపోకూడదన్న గీర్ట్ వైల్డర్స్.. శాంతి వచనాలు ఒక్కోసారి పరిస్థితిని మరింత దిగజార్చుతుందని తెలిపారు. నూపుర్ శర్మకు భారతీయులు అండగా ఉండాలని సలహా ఇచ్చారు.
I thought India had no sharia courts.
She should never apologize for speaking the truth about #Muhammad. She is not responsible for Udaipur. Radical intolerant jihadi Muslims are responsible and nobody else.
NupurSharma is a hero. #NupurSharma #IsupportNupurSharma
— Geert Wilders (@geertwilderspvv) July 1, 2022
Advertisements