వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ వారసురాళ్లు స్వప్న దత్, ప్రియాంక్ దత్ ప్రస్తుతం నిర్మాతలుగా కొనసాగుతున్నారు. ఇక అక్కినేని వారసురాలిగా సుప్రియ నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు. ఈమధ్య కోడి రామకృష్ణ తనయ కోడి దివ్య కూడా నిర్మాతగా మారారు. రీసెంట్ గా ఏడిద శ్రీరామ్ కుమార్తె కూడా నిర్మాణరంగంలోకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా తీశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో వారసురాలు వస్తున్నారు.
డీవీవీ దానయ్య కుమార్తె నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. గీతాఆర్ట్స్ కు అనుబంధంగా జీఏ2 బ్యానర్ ఏర్పాటుచేసినట్టు, కూతురు కోసం డీవీవీ2ను ఏర్పాటు చేస్తున్నారట దానయ్య. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తొలి ప్రయత్నంగా సినిమా నిర్మించాలా లేక వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వాలా అనే ఆలోచనలు ప్రస్తుతం సాగుతున్నాయి. చిరంజీవి కుమార్తె కూడా ఇలానే వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సినిమాలు నిర్మించారు. తన కూతురును కూడా ఇదే విధంగా లాంచ్ చేయాలని డీవీవీ దానయ్య భావిస్తున్నట్టున్నారు
డీవీవీ దానయ్య కొడుకు ఇప్పటికే హీరో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. సినిమా నడుస్తోంది. ఇప్పుడు కూతురు కూడా నిర్మాణ రంగంలో స్థిరపడితే తండ్రిగా దానయ్య తన బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.