ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధర్నా చేశారు. భారీగా తరలి వచ్చిన ఆప్ కార్యకర్తలతో కలిసి ఆయన ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేజ్రీవాల్ ఇంటి ముందు బైఠాయించారు. అయితే ఆప్ కార్యకర్తలు, డిప్యూటీ సీఎం ధర్నా చేసింది ఢిల్లీ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా.
కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. రైతులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీలోని ఏడు మైదానాలను జైళ్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని దానికి తాను ఒప్పుకోవడం లేదని కేజ్రీవాల్ పదే పదే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రైతులను కలిసి తన మద్దతు ప్రకటించారు.
అయితే, బంద్ సందర్భంగా సీఎంను తన ఇంటి నుండి దాటకుండా గృహనిర్బంధం చేశారని ఆప్ ఆరోచిపించింది. సీఎం ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చి, ధర్నా నిర్వహించారు.