కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకు ముందు ప్రధాని మోడీని అవమాన పరుస్తూ ఒక ఇటాలియన్ మహిళ ఉండేదని సోనియాగాంధీని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.
ఇప్పుడు ఆమె స్థానంలో ప్రధాని మోడీ తల్లిని అవమానించే ఇటాలియా(గోపాల్ ఇటాలియా) ఉన్నారని ఆయన పరోక్షంగా మండిపడ్డారు. అంతకు ముందున్న నేతను గుజరాత్ ఆమోదించలేదని, ఇప్పుడు వచ్చిన నేతను కూడా ఆమోదించబోదని ఆయన తెలిపారు.
గుజరాత్ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ ల మధ్య ఇటీవల మాటల యుద్దం నడుస్తోంది. ఈ క్రమంలో గోపాల్ ఇటాలియా వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మోడీ తల్లిపై గోపాల్ ఇటాలియా విమర్శలు చేశారు.
మోడీ తల్లి చేసిన ఏకైక నేరమేంటంటే అది నరేంద్ర మోడీకి జన్మనివ్వడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందువల్ల మీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆమెను శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.
దీనిపై బీజేపీ ఫైర్ అయింది. ఆ వీడియోను ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల్లో ఆప్ చిత్తుగా ఓడిపోతుందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హెచ్చరించిన వీడియోను బీజేపీ షేర్ చేసింది.