జమ్ము కశ్మీర్ లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రియాసీ జిల్లా కత్రా ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
కత్రాకు తూర్పున 84 కిలో మీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూ కంపం సంభవించినట్టు వెల్లడించింది. ‘ గురువారం ఉదయం 3.02గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. కత్రాకు తూర్పున 84 కిలో మీటర్ల దూరంలో చోటు చేసుకుంది” అని తెలిపారు.
గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఒక్క సారిగా భయాందోళనలకు గురయ్యారు. భయంతో వారు బయటికి పరుగులు తీశారు. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
మరో వైపు జమ్ములోని పహల్ గామ్ ప్రాంతంలో బుధవారం ఉదయం భూంకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూంకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. పహల్ గామ్ కు దక్షిణంగా15 కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అధికారులు వివరాలను వెల్లడించారు.