ఆప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించి భారీ నష్టం చోటుచేసుకుంది. దేశంలో రెండు ప్రాంతాల్లో జరిగిన భూకంపంలో మొత్తం 26 మంది చనిపోయారు. పశ్చిమ అప్ఘానిస్థాన్ లోని ముక్వార్ సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది.
బాద్ఘీస్ పశ్చిమ ప్రావిన్సు పరిధిలోని క్వాదీస్ సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. బాద్ఘీస్ పశ్చిమ ప్రావిన్సు పరిధిలోని క్వాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడి ఎక్కువ మరణాలు సంభవించాయని ఆప్ఘాన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ చెప్పారు.
రెండు ప్రాంతాల్లో మొత్తం 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలతో కూడా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలో కరువు ప్రాంతాల్లో క్వాదీస్ ప్రాంతం ఒకటిగా ఉంది. గత 20 ఏళ్లుగా తీవ్ర కరవు పరిస్థితులతో ఈ ప్రాంతం అల్లాడుతోంది. ఇక్కడ తరచూ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
2015వ సంవత్సరంలో సంభవించిన భూకంపంలో 280 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. భూప్రకంపనలకు ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారని స్థానిక మీడియాసంస్థ పేర్కొంది.