దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. కాశ్మీర్, నోయిడాలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదైంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోనూ 3.6 తీవ్రతతో భూమి కంపించింది.
భారత్ తో పాటు అఫ్గాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో కూడా భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దాని ప్రభావం ఇక్కడి కశ్మీర్, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడిందని చెబుతున్నారు.
పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో అయితే భారీ భూకంపం సంభవించింది. తీవ్రత 7.3గా నమోదైంది. ఉదయం 9.56 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు అధికారులు.