నిజామాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆదివారం స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కూల్‌పై 3.1 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారు జామున భూమి కంపించడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భూమి నుంచి శబ్దాలు రావడంతో.. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
నిజామాబాద్‌కి 120 కిలోమీటర్ల దూరంలో, ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. భూకంపాలు ఎందుకు నమోదవుతున్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. 2022 డిసెంబర్ 6వ తేదీన జహీరాబాద్ మండలం బిలాపూర్ లో భూకంపం చోటు చేసుకుంది. భారీ శబ్దంతో భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 2021 అక్టోబర్ 2న రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ లలో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 4.0 గా నమోదైంది.
2022 అక్టోబర్ 15న ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం వాటిల్లింది. 2021 నవంబర్ 1న తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీమ్, మంచిర్యాల జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ 29న ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం వాటిల్లింది. 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.