హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ రాజధానికి 61 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
భూకంప కేంద్రం భూమికి 7 కి.మీ దిగువన ఉందని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ లో ఈ నెలలో ఇప్పటికే మూడు సార్లు భూ కంపం సంభవించింది. మొదటగా ఫిబ్రవరి 5 తేదిన భూకంపం సంభవించింది.
ఆ తర్వాత ఫిబ్రవరి 6న రెండో సారి భూకంపం వచ్చింది. కిన్నూర్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం కనిపించినట్టు అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.1గా నమోదైనట్టు వెల్లడించారు.
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. గత నెలలోనూ రాష్ట్రం మూడు భూకంపాలను చూసింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని భూకంపాలు స్వల్ప స్థాయిలోనే రావడం గమనార్హం.