మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. ఉఖ్రుల్ ప్రాంతంలో శనివారం ఉదయం భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్ సీఎస్) వెల్లడించింది.
భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని ఎన్ సీఎస్ పేర్కొంది. ఉఖ్రుల్ ప్రాంతాని 94 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు ఎన్ సీఎస్ చెప్పింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని అధికారులు తెలిపారు.
నిన్న రాత్రి హర్యానా, పశ్చిమ యూపీ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. షమ్లీ ప్రాంతంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు పేర్కొన్నారు.
పశ్చిమ యూపీ ప్రాంతంలోన రాత్రి 9.31 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు ఎన్ సీఎస్ చెప్పింది. భూమిలోపల 5 కిలీమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్టు అధికారులు వివరించారు.