తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఏపీలోని గుంటూరుజిల్లా పులిచింతల సమీపంలో ఉదయం 7.15 నుంచి 8.20 గంటల మధ్య భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3, 2.7, 2.3 గా తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణలోని సూర్యాపేట, చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాల్లోనూ భూమి కంపించింది. గత వారం రోజుల నుంచి పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వస్తున్నాయని చెబుతున్నారు అధికారులు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు.