మేఘాలయాలో భూకంపం సంభవించింది. తురా ప్రాంతానికి 59 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించింది. ఉదయం 6.57గంటలకు స్వల్పంగా భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్టు వెల్లడించింది. భూమి లోపల 29 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు చెప్పింది. ఈశాన్య ప్రాంతంలో ఈ రోజు ఇది రెండో భూకంపమని తెలిపింది.
అంతకు ముందు ఈ రోజు ఉదయం మణిపూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. నోనే ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 2.46 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్క సారిగా భయాందోళనలకు గురయ్యారు.
అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందారు. భూమి లోపల 25 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు పేర్కొన్నారు.