రైల్వేలో ఉద్యోగం చేయడం మీ కల అయితే ఇంకెందుకు ఆలస్యం… రైల్వేలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ రైల్వే. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏకంగా 1216 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈస్ట్ కోస్టు రైల్వే జోనులో మొత్తం 1216పోస్టులను భర్తీ చేయనుండగా… అందులో ఏపీలోని వాల్తేరు డివిజన్‌లో 553పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 6వ తేదీ చివరి రోజుగా రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో మొత్తం 1216 అప్రెంటీస్ ఖాళీల్లో ఫిట్టర్- 483, ఎలక్ట్రీషియన్- 218, వెల్డర్- 141, కార్పెంటర్- 99, వైర్‌మ్యాన్- 42, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 42, మెషినిస్ట్- 40, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్- 26, ప్లంబర్- 23, మేసన్- 23, షీట్ మెటల్ వర్కర్- 20, టర్నర్- 20, మెకానిక్ (M.V.)- 10, పెయింటర్- 10, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 10, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానిక్- 6, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 3 పోస్టులున్నాయి.
Advertisements
అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి ఉతీర్ణత సాధించడంతో పాటు సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కల్గి ఉండాలనే నిబంధనను పొందుపర్చారు. అలాగే వయస్సు నిబంధనలు కూడా అధికారులు పేర్కొన్నారు. 15 ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ www.rrceastcoastrailway.in ఓపెన్ చేసి చూడొచ్చు.